25.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

వచ్చేసిన సుందరం మాస్టర్ టీజర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఆడియన్స్ నుంచి కంటెంట్ బాగుంటే చాలు అనే అభిప్రాయమే వినపడుతోంది. కంటెంట్ కొత్తగా .. పూర్తి వినోదభరితంగా ఉంటే చాలు, భారీ వసూళ్లను ముట్టజెబుతున్నారు. దాంతో కొత్త దర్శకులు వీలైనంత వరకూ డిఫరెంట్ కంటెంట్ పట్టుకునే సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. అలా వచ్చిన సినిమాగా ‘సుందరం మాస్టర్’ కనిపిస్తోంది.

కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సుందరం మాస్టర్’. మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి దివ్య శ్రీపాద ఫిమేల్ లీడ్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మంగళవారం విశాఖపట్నంలో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో సాయి ధర్మ తేజ్ చేతుల మీదుగా టీజర్ ను లాంచ్ చేశారు. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచిన ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ గా సాగింది.

టీజర్ లోకి వెళ్తే, ఇంగ్లీష్ పాఠాలు బోధించడానికి అటవీ ప్రాంతంలో గిరిజనులు జీవించే ఒక మారుమూల పల్లెటూరికి వెళ్తాడు సుందరం మాస్టర్. అక్కడ అన్ని వ‌య‌సుల‌ వారికి తరగతులు ఏర్పాటు చేసి, తన శైలిలో ఇంగ్లీష్ నేర్పించడానికి ట్రై చేస్తాడు. అయితే పాఠాలు చెప్పడానికి వచ్చిన సుందరానికి పెద్ద షాక్ తగులుతుంది. అక్కడి ట్రైబల్స్ అందరూ తన కంటే కంటే ఇంగ్లీష్ బాగా మాటాడుతుండటంతో మాస్టర్ బిత్తరపోతాడు. ఈ క్రమంలో ట్రైబల్స్ కి సుందరానికి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.

చివర్లో హర్ష కట్టెల మోపు తెచ్చి సిగరెట్ వెలిగించుకోడానికి నిప్పుందా అని ఒక పెద్దాయన్ని అడగ్గా.. ఆయన ఇంగ్లీష్ లో బూతులు తిట్టడం నవ్విస్తుంది. ఓవరాల్ గా కామెడీ ప్రధానంగా సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అయితే అసలు ఆ గూడెంలో ఏం జరుగుతోంది? వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? సుందరం మాస్టర్ అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు? మధ్యలో అతని లవ్ స్టోరీ ఏమైంది? అనేది తెలియాలంటే ‘సుందరం మాస్టర్’ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘‘సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు, అక్ష‌ర‌, ర‌మ‌గారు, రావుగారు మొద‌టి మూడు కార‌ణాలు. హ‌ర్ష వాళ్ల‌బ్బాయే. త‌ను బాగా న‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో ర‌వితేజ‌గారు. ఆయ‌న నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌న కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌రం మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ వ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్‌గారికి.. అంద‌రికీ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అని తెలిపారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్