తెలుగు రాష్ట్రాలలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలకు జనం విలవిలలాడుతున్నారు. బయట కు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు పగటిపూట వడగాలులు వీచే పరిస్థితులు ఉన్నట్లు ప్రకటించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సూచనలు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ జాబి తాలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటిసారి వడగాలులు నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. నిన్న వేముల పల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా ఇక్కడ వడగాలులు వీస్తున్నట్లు గుర్తించారు. నిన్న ఖమ్మంలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీలు నమోదయ్యాయి. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకో కపోతే వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని..కనుక వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకో వాలంటున్నారు. వేసవిలో చమట ఎక్కువ పడుతుంది కనుక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలని..అదే విధంగా కూల్‌డ్రింక్‌కు బదులు మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఉత్తమంటున్నారు.