స్వతంత్ర వెబ్ డెస్క్: యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) మీడియాకు క్షమాపణలు(Apology) చెప్పారు. ‘ఆదికేశవ’ (Adikesava)ఈవెంట్ లో తన వ్యాఖ్యలు బాధిస్తే మన్నించాలని కోరారు.
ప్రముఖ యాంకర్, టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల(Suma Kanakala) గురించి టాలీవుడ్(Tollywood) ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా తన చలాకీ మాటలతో ఆడియన్స్ ను అలరిస్తూ, ప్రతీ తెలుగు ఇంటి లోనూ భాగమైంది. ఓవైపు హోస్ట్ గా బుల్లి తెరపై హవా కొనసాగిస్తూనే, మరో వైపు యాంకర్ గా వరుస సినిమా ఈవెంట్స్(Events)తో దూసుకుపోతోంది. ఆమె డేట్స్ ఖాళీ లేక సినిమా ఫంక్షన్స్(Movie functions)వాయిదా వేసుకుంటున్నారంటే సుమ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన మాటలతో, పంచ్ డైలాగ్స్ తో ఎలాంటి వేదికనైనా తన కంట్రోల్ లోకి తెచ్చుకునే సుమ.. ఇతరులను నొప్పించకుండానే సెటైర్స్ వేయడంలో దిట్ట అనిపించుకుంది. అయితే అనుకోకుండా ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), శ్రీలీల(Sreleela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమాలోని ‘లీలమ్మో’ అనే పాటను హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా సుమ వ్యవహరించారు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. ”మేం పెట్టిన స్నాక్స్(Snacks) ను భోజనంలా తింటున్నారు.. త్వరగా లోపలికి వచ్చి మీ మీ కెమెరాలను ఇక్కడ పెట్టాలని కోరుతున్నాము. బాబూ.. నువ్వు ముగ్గురికి చెప్పు.. వాళ్లను మరో ముగ్గురికి చెప్పమని చెప్పు.. తొందరగా రండి” అని సుమ వ్యాఖ్యానించారు. దీనికి నొచ్చుకున్న ఓ సినీ జర్నలిస్ట్(Film journalist) ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమ ఇంటెన్షన్ చూస్తుంటే..అందరూ రావాలంటూ సరదాగా చెప్పే క్రమంగా..ఆమె ఇలా అన్నారని విషయం తెలుస్తోన్న..దీంతో స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారంటూ కామెంట్‍పై ఓ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా వారు స్నాక్స్ ను భోజనంలా తింటున్నారని అన్నారు.. అలా అనకుండా ఉంటే బాగుండేదని ఆ జర్నలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సుమ స్పందిస్తూ.. “ఓకే అండి.. అది నేను జోక్ గా అన్నాను. ఎందుకంటే మీరంతా చాలా ఏళ్ళ నుంచి నాకు తెలిసినవారే.. ఆ చనువుతో అలా మాట్లాడాను” అని బదులిచ్చారు. దీంతో “మీరు జోక్స్ బాగా వేస్తారు.. కానీ వాటిల్లో మీడియా(Media)కు మినహాయింపు ఇవ్వండి” అని సదరు విలేఖరి అన్నారు. అప్పుడు సుమ ‘మీరు స్నాక్స్ ను స్నాక్స్ లానే తిన్నారు.. ఓకేనా?’ అని అడగ్గా.. ‘ఇదే వద్దనేది. ప్లీజ్.. జనరల్ గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమేగానీ, మీడియా విషయంలో మాత్రం ఇలాంటివి వద్దు’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
తన మాటలకు బాధ పడినందుకు వేదికపై నుంచే సుమ(Suma) మీడియా మిత్రులను క్షమాపణలు కోరారు. ఆ తర్వాత మరో మారు దీనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియా (Social Media)లో ఓ వీడియో పోస్ట్ చేశారు. “మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ(apology) కోరుతున్నాను. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.