సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.
కామెడీ డ్రామా కథతో రూపొందిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. గత నెల నుంచి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ జోరుగా నిర్వహించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. వైవిధ్యమైన కథా కథనాలతో తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ థియేటర్స్ లో ఆడియెన్స్ కు యూనిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది.
నటీనటులు – సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు
టెక్నికల్ టీమ్ –
సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,
ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా, ఏలూరు శ్రీను
బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని


