Back Pain Relief| ఇటీవల కాలంలో చాలా మంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. గ్రామంలో ఉన్నవాళ్లు కాయకష్టం చేస్తే గాని పూట గడవదు.. ఇక హైదరాబాద్ లాంటి మహా నగరాలలో ఉద్యోగాలలో స్థిరపడిపోయిన వారు… తదేకంగా కంప్యూటర్ తో పని చేయడం వలన విసిగెత్తిపోతున్నారు. ఒకే పొజిషన్ లో అలాగే కూర్చుండటం వల్ల అనేక ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ తరంలో ఉద్యోగం చేస్తున్నవారికి ప్రధానంగా వేధిస్తున్న సమస్య నడుం నొప్పి, మెడ నోప్పి… కొంతమందికి చేతులు, కాళ్ళు కూడా లాగుతూ ఇబ్బంది పెడుతుంటాయి.
ఒకేచోట ఒకేపోజిషన్ లో అలాగే కూర్చుండటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగక, వెన్నుపై భారం పడుతుంది. మనం కంప్యూటర్ లో నిమగ్నం అయి ఉండటం వల్ల వచ్చే నొప్పిని కూడా తట్టుకుంటూ అలాగే పని చేస్తాము.. చిన్న చిన్నగా మొదలైన ఆ నొప్పి క్రమేపి పెద్దదై తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే పట్టరానంత బాధేస్తుంది. మనస్సులో అలజడి, తలనొప్పి, అశాంతి మొదలవుతాయి. అసలు ఇలా జరుగకుండా ఉండాలంటే… గంటకు ఒక్కసారి శరీరానికి రక్షప్రసరణ జరిగేలా కాస్త లేచి నడవాలి. మంచినీరు గంటకు రెండు గ్లాసులు తాగాలి. ఇంటి దగ్గర వ్యాయామం లాంటిది చేస్తే.. కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి మనసుకి చాలా దగ్గర సంభందం ఉంటుందని చెబుతుంటారు. శరీరానికి వచ్చిన నొప్పిని మనసుని ప్రశాంతంగా ఉంచడం ద్వారా తగ్గించుకోవచ్చు. యోగ, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయడం ద్వారా ఎలాంటి నొప్పులు రాకుండా చేసుకోవచ్చు. నడుం నొప్పి, మెడ నొప్పికి సంభందించిన వ్యాయామం చేయడం ద్వారా కూడా నివారించుకోవచ్చు.
అయితే శరీరంలో ఏర్పడిన ఒళ్ళు నొప్పులకు కాస్త రిలీఫ్ ఇస్తే.. ఇట్టె తగ్గించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణలు. ఒక గ్లాసు చిక్కటి పాలను చిటికెడు పసుపు వేసి.. బాగా మరిగించి కాచి చల్లార్చి తాగాలి. ఆ తర్వాత.. చల్లని గాలి తగిలే ప్రదేశంలో స్పంచి లాంటి దిండును పెట్టుకొని హాయిగా నిద్రపోవాలి.. ఇలా కొద్దీ రోజులు చేశారంటే.. శరీరంలోనే అన్ని అవయవాలకు రెస్ట్ దొరుకుంటుంది. తద్వారా నొప్పులన్ని మటుమాయం అవుతాయి. అలాగే.. ఒక అల్లం ముక్కను మంచినీరులో వేసి మరిగించి కాచి చల్లార్చిన ఆ నీటిని.. స్వచ్ఛమైన తేనెతో తీసుకోవాలి.. ఇలా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరిగి ఒళ్ళు నొప్పులు తగ్గే ఆస్కారం ఉంది.


