తెలంగాణ వాసులను కల్తీ ఫుడ్ ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్టు బయటపడటంతో మున్సిపల్ అధికారు లు దృష్టి సారించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్‌లలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన మంసాహార ఉత్పత్తులను గుర్తించి, 50 వేల రూపాయల సరుకును మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఖననం చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. వర్షాకాలంలో మరింత జాగ్రతగా ఉండాల్సిన అవసరముందని, ప్రజలను నాణ్యమైన ఆహారాన్ని విక్రయించాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని, రెస్టారెంట్‌లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.


