ఏపీ రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో రాజధానిలోని పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశంపై చర్చించింది సబ్ కమిటీ. గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే కొత్తగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయించడం, అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం వంటి వాటిపై సబ్ కమిటీ ఫోకస్ పెట్టనుంది.
గతంలో చంద్రబాబు హాయాంలో 120కి పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115కి పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఈ క్రమంలోనే అమరావతికి భూకేటాయింపులపై ఫోకస్ పెట్టిన సర్కార్.. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీని నియమించింది.