24.2 C
Hyderabad
Saturday, March 14, 2026
spot_img

అమరావతికి భూకేటాయింపులపై సబ్‌ కమిటీ భేటీ

ఏపీ రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సబ్‌ కమిటీ సమావేశమైంది. సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో రాజధానిలోని పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశంపై చర్చించింది సబ్‌ కమిటీ. గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే కొత్తగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయించడం, అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం వంటి వాటిపై సబ్‌ కమిటీ ఫోకస్‌ పెట్టనుంది.

గతంలో చంద్రబాబు హాయాంలో 120కి పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115కి పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఈ క్రమంలోనే అమరావతికి భూకేటాయింపులపై ఫోకస్‌ పెట్టిన సర్కార్‌.. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్‌ కమిటీని నియమించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్