స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 63,532 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 18,869 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాల దిశగా పయనిస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.93 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, టైటన్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. గతవారాన్ని అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగించాయి. లాభాల స్వీకరణ నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం నష్టాల్లో పయనిస్తున్నాయి. త్వరలో జీఎస్‌టీ మండలి సమావేశం జరగనుండటంతో, రేట్ల సవరణలు ఆశిస్తున్న కొన్ని రంగాల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Latest Articles
- Advertisement -