దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టిన సూచీలు… ఆధ్యంతం ఒడిదొడుకులు మద్య కదిలాయి. ఉదయం సెన్సెక్స్ 57,751.50 దగ్గర మొదలై.. ఇంట్రాడేలో 57,949.45- 57,494.91 మధ్య కదలాడింది. చివరకు 40.14 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613.72 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,031.75 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,061.75- 16,913.75 వద్ద కదలాడి చివరకు 34 పాయింట్లు నష్టపోయి 16,951.70 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.20గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టైటన్ షేర్లు లాభాల బాటలో ఉండగా… టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.