Telangana: తెలంగాణలో బీజేపీ మహా ధర్నాకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచింది. 500 మందితో ధర్నా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ అనే నినాదంతో రేపు (మర్చి 25) హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించగా.. నేడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ధర్నాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు సూచనలు చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.