తన ప్రవచనలతో లోక కల్యాణం కోసం కృషి చేస్తున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో రంగంలోకి దిగారు. సంప్రదాయ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చాగంటి సమావేశమయ్యారు. తనకు విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల్లో సలహాలు, సూచనలు కావాలని సీఎం చంద్రబాబు కోరారు.
అంతకుముందు నారా లోకేశ్‌తో కూడా చాగంటి సమావేశమయ్యారు. చాగంటితో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలన్నారు. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలని చాగంటిని కోరారు. తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని చాగంటి తెలిపారు.
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. నైతిక విలువలు కూడా తెలిస్తేనే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని చాగంటికి సీఎం చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు.