విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలంరేపింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు శంకర్రావు డ్యూటీకి యథా విధిగానే హాజరయ్యారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో ! తన దగ్గర ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఐవోబీ బ్యాంకులో గన్ మెన్‌గా శంకర్రావు విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శంకర్రావు ఆత్మహత్య ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో నమోద య్యాయి.


