తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి. వీటి పదవీకాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా అదేనెల 27వ తేదీన పాలకమండళ్లు కొలువుతీరాయి. దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుంది. దీనికి కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులిచ్చారు. పంచాయతీలు, జిల్లాపరిషత్‌ల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది.
ఆదివారం పదవీకాలం ముగియటంతో.. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పాలన మొదలైంది. తెలంగాణలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. అదేనెల 27న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త పాలకమండళ్లు ఏర్పాటయ్యాయి. ఆదివారం నాటికి ఐదేళ్లు పూర్తి కావటంతో.. ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28న కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియనుండగా.. దీనికి కూడా కూడా ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 ఫిబ్రవరిలో జరగ్గా… అదే నెలలో కొత్త పాలకవర్గం కొలువుతీరింది. GHMCతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా 2021లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మరో ఏడాదిపైగానే ఉంది. ఇక ఔటర్ రింగు రోడ్డు వరకు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా.. నగర శివార్లలో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీటి పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు.