మహా కుంభమేళాలో మోనాలిసా అనే పూసలమ్మే అమ్మాయికి ఊహించని విధంగా స్టార్‌డమ్ వచ్చింది. సోషల్ మీడియా ఒక సాధారణ వ్యక్తిని రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెడుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. వైరల్ అయిన వీడియో ఆమెకు ఎక్కడలేని ఫేమ్ తెచ్చిపెట్టింది.ఇది ఆమె ఉనికికి సవాలుగా మారింది. వాస్తవానికి మోనాలిసా లాంటి వారి జీవితాలను డిజిటల్ మీడియా ఎంతో ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఎంతోమందికి డిజిటల్ యుగం ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా నిరాడంబరమైన నేపథ్యాల నుండి వచ్చిన యువకులకు, ఒక్క క్షణం జీవిత గమనాన్ని ఎలా మార్చగలదో చూపించింది.అదేమాదిరిగా ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోంస్లే మహా కుంభమేళాలో మరపురాని పబ్లిసిటీని సొంతం చేసుకుంది.. ఆధునిక సోషల్ మీడియా శక్తికి, డిజిటల్ యుగంలో అనూహ్యంగా స్టార్‌డమ్ కారణం కావచ్చు..కానీ ఇది కొందరి జీవితాలకు ఎదుగుదలను అందిస్తే కొంతమందిని ఏమార్చింది. జీవితాలను నాశనం చేసింది…మరి మోనాలిసా జీవితాన్ని ఈ స్టార్ డమ్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం…
ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోంస్లే అనే 16 ఏళ్ల అమ్మాయి..రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబంలో పుట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా…ఆధ్యాత్మిక కేంద్రంగా మారడంతో దండలమ్ముకోవడానికి ఆమె కుటుంబంతో ప్రయాగకు వచ్చింది. ఈ భారీ జనసమూహంలో ముందుగా వాళ్లని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు..కానీ త్రివేణి సంగమం వద్ద భక్తులు “తమ పాపాలను కడుక్కోవడానికి” గుమిగూడే పవిత్ర వాతావరణం మధ్య ఇండోర్‌కు చెందిన ఈ యువతి అనూహ్యంగా సోషల్ మీడియా కంట పడింది. అంతే క్షణాల్లో మోనాలిసా అందం సంచలనాలను సృష్టించింది.
సోషల్ మీడియాలో ”shivam_bikaneri_official” ఖాతా నుండి ఒక వీడియో ముందుగా వైరల్ అయ్యింది. ఒక యూట్యూబర్ ఆ అమ్మాయిని ఎక్కడి నుండి వచ్చావు? నీకు Facebook మరియు Instagram ఖాతాలు ఉన్నాయా? అని అడగడం కనిపించింది. ఆ ప్రశ్నలన్నింటికీ ఆమె నవ్వుతూ సమాధానం చెప్పింది.ఈ వీడియో వైరల్ అవ్వడంతో జనాల్లోకి వేగంగా వీడియో స్ప్రెడ్ అయ్యింది…దీంతో కుంభమేళాలో జనాలు ఆమె ఆందాన్ని నేరుగా చూడడానికి ఆసక్తి చూపించారు.దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనలకు లోనయ్యారు.చివరకు ఆ కుటుంబం ఆ అమ్మాయి భద్రత కోసం నానాయాతనలు పడాల్సి వచ్చింది. ప్రజలు వేలం వెర్రిగా ఆ అమ్మాయి చుట్టూ చేరి తన ప్రైవసీ ఆటకం కలింగించే స్థాయికి చేరింది.దీంతో ఆమె తన ముఖారవిందం పై ముసుగువేసి దాక్కోవాల్సి వచ్చింది.
కుంభమేళాకు ప్రతీ ఒక్కరు ఆమె అందాన్ని ఫోన్ లో బంధించి ప్రపంచ సుందరీమణుల అందానికి ఫిదా అయ్యే పిపాసకులకు చేరవేశారు..వారి కష్టం ఫలించి యూట్యూబ్ ..సోషల్ మీడియోల్లో ఎక్కడా చూసినా ఆమె చిత్రాలు ..వీడియోలే దర్శనమిస్తున్నాయి…సోషల్ మీడియానా మజాకా అన్నట్టు ఒక రోజులోనే ఆమె సెలబ్రిటీ అయ్యింది. దీంతో ఈ బ్రౌన్ బ్యూటీని బాలీవుడ్ హీరోయిన్ చేయాలని…కుర్రకారు సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయనే ప్రచారాలు జోరందుకున్నాయి.
మోనాలిసా అందం చూపరుల్ని మంత్రముగ్ధులను చేస్తోంది… ఆమె అందం…అమాయకత్వం… నిర్మలమైన ప్రవర్తన కారణంగా ప్రకృతి చెక్కిన అందాల భరిణిగా … దేవుడనే డైరెక్టర్ లో ఆమె పాత్ర అద్భుతంగా పండింది. మహాకుంభమేళాలో సంచలనంగా మారింది. ఆమె వైరల్ వీడియోలు..నిజంగా అద్భుతమైన ఫేస్ ఫీచర్లు బ్రౌన్ బ్యూటీగా పేరు తెచ్చిపెట్టాయి. ఉన్నఫళానా ….. ఏ బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనకుండానే అశేష ప్రజాదరణ పొందింది.ఇది చూసి ప్రపంచ అందగత్తెలమని విర్రవీగే కాస్మెటిక్ బ్యూటీస్ కుళ్లుకుంటున్నారు…ఆమె సహజమైన అందం ముందు కాస్మెటిక్స్ కంపెనీలు కూడా క్యూకట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని…సౌందర్యారాధకులు తెగ పొగిడేస్తున్నారు…బహుశా ఆమె ఆందం ఆమెకే సవాలుగా మారింది. చివరికి ఆమె తండ్రి జనాల అద్దడి తట్టుకోలేక ఇండోర్‌కు పంపించేశాడు.
ఆమె అందానికి ఫిదా అయ్యిన కుర్రకారు సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు…వైరల్ అయిన ఆమె వీడియో దాదాపు 15 మిలియన్లకు పైగా వీక్షణలు వెల్లువెత్తాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో ఒక వ్యక్తి మోలిసాను “పెళ్లి చేసుకున్నారా” అని అడిగాడు..అలాగే మహాకుంభమేళాలో నిన్ను అనుసరించే పురుషులలో ఎవరైనా ఇష్టపడ్డావా” అని అడిగాడు.దానికి మోనాలిసా స్పందిస్తూ, “నేను వారిని ఎందుకు ఇష్టపడతాను? వారందరూ నా సోదరులు, అని సమాధానం ఇచ్చింది.అంతేకాదు తన తల్లిదండ్రులకు నచ్చిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఒక సెలబ్రిటీ ఆలోచించే స్థాయిని మించి హుందాగా సమాధానం చెప్పడం అక్కడి వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది..దీంతో జనాలు ఆమె అందంతోపాటు మనో సౌందర్యానికి కూడా ముగ్దులయ్యారు.
మోనాలిసా లుక్స్ కుర్రకారు గుండెలను ఆకర్షించడంతో….ఆమె దండలు అమ్ముతున్నప్పటికీ… ఆమె అందించే ఉత్పత్తులను కొనడం కంటే చాలా మంది ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపారు. అమ్మకాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న ఆమె తండ్రికి ఈ పరిస్థితి కొంత నిరాశకు దారితీసింది. మోనాలిసా అందంపై పబ్లిక్ చూపించే అధిక శ్రద్ధతో అతను అసౌకర్యాన్ని కూడా వ్యక్తం చేశాడు.జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, మోనాలిసా తండ్రి ఆమెను ఇండోర్‌కు తిరిగి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకు కొత్తగా వచ్చిన కీర్తి కంటే.. ఆమె భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చాడు.
ఇదిలా ఉంటే అప్పుడే బాలీవుడ్ ను దాటి టాలీవుడ్ లో రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ లు వచ్చాయని నెటిజన్లు ప్రచారాలు మొదలెట్టారు…లియోనార్డో డా విన్సీ చిత్రించిన మోనాలిసా చిత్రం కంటే ఈమె అందమే ఒక్కరోజులో రికార్డులు సృష్టించింది.ఆమె తండ్రి తనకు మోనాలిసా అనే పేరు ఎందుకు పెట్టాడో కానీ…ఆ పేరు సార్థకత చేకూరిందని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.విచిత్రం ఏమిటంటే ఈమె సిబిలింగ్స్ కూడా అంతే అందగత్తెలని చెబుతున్నారు..మొత్తానికి ఆమె సోదరీమణులంతా అందగత్తెలని నెటిజన్లు ఫిదా అవుతున్నారు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం మైసూర్‌లో చరణ్‌పై కొన్ని కీలక మైన సన్నివేశాలు కూడా తెరకెక్కించారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తేనె కళ్ల సుందరి మోనాలిసా భోంస్లే మరో బంపరాఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ బ్యూటీ ఆర్ సీ-16 మూవీలో రామ్‌చరణ్‌తో కలిసి నటించబోతుందట. దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతోంది. ఇక దేశవ్యాప్తంగా తన అందంతో యూత్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మోనాలిసాకి ఈ సినిమాలో మంచి రోల్ పడితే మాత్రం మోనాలిసా దశ తిరిగినట్టేనని సినీ అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది మోనాలిసా అందానికి ఫిదా అయిన యూత్ ఏకంగా ఆ అమ్మాయికి సినిమా ఛాన్స్ లు రావాలని పూజలు కూడా చేయిస్తున్నారని సమాచారం… బాలీవుడ్,,టాలీవుడ్…కోలీవుడ్ అన్నింటా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని…16 ఏళ్ల మోనాలిసా
16 సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేయాలని తేని కళ్లచిన్నదానిపై వల్లమాలిన అభిమానాన్ని ఒలకబోస్తున్నారు యూత్.
మొత్తానికి డిజిటల్ మీడియా పుణ్యమా అని రాగ్స్ టు రిచెస్ అనే చందంగా మారింది అదృష్టవంతుల జీవిత కథలు..టెక్ ఎరాలో టెక్నాలజీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి సైతం మంచి ఆవకాశాలను తెచ్చిపెడుతోంది.