Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా రాజకీయ పరిణామాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జనసేనతో బీజేపీ పొత్తు అంశంపై ప్రస్తావించిన సోము.. జనసేన పార్టీతో బీజేపీ పొత్తులో ఉందని వెల్లడించారు. అయితే ఈ విషయంపై మాకు క్లారిటీ ఉందని.. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధే ద్యేయంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. పొత్తుల విషయంలో ఏది జరగాలో అదే జరుగుతుందని.. ఎన్డీయేతో జనసేన పార్టీ పొత్తులో ఉందని అన్నారు. ఒంటరిగా పోరాడిన, సమిష్టిగా పోరాడిన రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోరాటాలు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడటానికి జనసేనతో కలిసి ముందుకు వెళతామన్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత పవన్ చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని సోము అన్నారు.