26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
spot_img

డేంజర్ జోన్ లో మంచుప్రాంత నగరాలు

   హిమాలయ ప్రాంత నగరాలు డేంజర్‌ జోన్‌లో చిక్కుకున్నాయి. ఈ నగరాల్లో తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నా యి. మైదాన ప్రాంత నగరాల్లో భారీ వర్షాలు,వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉత్తరాదిన హిమాలయ పర్వత ప్రాంత నగరాల్లో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయ. కొన్ని నగరాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. మరికొన్ని చోట్ల భూమి కుంగిపోవడం కూడా జరుగుతోంది. ఇవన్నీ అక్కడి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ, ఆక్రమణలకు పాల్పడుతూ ప్రణాళికా రహితంగా నిర్మాణాలు చేపడుతుండటం వల్లనే విపత్తుల వేళ నగరాల్లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయని ఒక కేసు సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ఇటీవల వరద బీభత్సానికి వణికిపోయాయి. హిమాలయ పర్వత సానువుల్లోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేకసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే, నదులు పోటెత్తాయి. కొన్నిచోట్ల భూమి కోతకు గురైంది. మరికొన్నిచోట్ల కుంగిపోయింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే, హిమాలయ పర్వత రాష్ట్రాల్లో భిన్నమైన భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఈ రాష్ట్రాల్లో ఉన్న జోషిమఠ్‌,సిమ్లా, డెహ్రాడూన్, డార్జిలింగ్, చమేలీ వంటి నగర, పట్టణ ప్రాంతాలు స్థానికంగా అనేక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులతోనూ సతమతమ వుతున్నాయి.

  హిమాలయ రాష్ట్రాల్లో 2013 అలాగే 2020 సంవత్సరాల్లో వరదలు విరుచుకుపడ్డాయి. దీంతో భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాదు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. దీంతో పాటు సిమ్లా, డార్జిలింగ్‌లో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రసిద్ద పర్యాటక స్థలాలున్న హిమ నగరాల్లో అనేక సమస్యలున్నాయి. వాహనాల రద్దీ, దీంతోపాఉ పార్కింగ్ సమస్య ప్రధాన మైనవి. వీటితోపాటు తాగునీటి ఇబ్బందులు, వాయు కాలుష్యం వంటివి కూడా ఉన్నాయి. హిమ నగరాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. జనాభాతో పాటు పర్యాటకులు కూడా పెరుగుతు న్నారు. దీంతో హిమ నగరాల్లో మౌలిక వసతులపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ఇదిలా ఉంటే హిమనగరాల్లోని ఈ దుస్థితికి ప్రకృతి విపత్తులే కారణమని చెప్పి బాధ్యతల నుంచి తప్పించు కోవాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ప్రకృతి విపత్తులే కారణమన్న వాదనను తప్పుపడుతున్నారు పట్టణా భివృ ద్ధి వ్యవహారాల నిపుణులు. మైదాన ప్రాంత నగరాలకు అనువైన అభివృద్ది ప్రణాళికలను భౌగోళికంగా ఎంతో భిన్నంగా ఉండే హిమాలయ నగరాల్లో అమలుచేస్తుండడమే అనేక సమస్యలకు కారణమవుతోం దన్నది నిపుణుల వాదన. వాస్తవానికి హిమాలయ నగరాలు ఇసుక, రాతి నిక్షేపాలపై ఏర్పడ్డాయి. అయితే మానవ ఆవాసాలకు ఇది స్థిరమైన నేలకాదు. హిమాలయ నగరాల్లో భారీ నిర్మాణా లు ఏమాత్రం పనికిరావు. అయితే ఈ మౌలిక సూత్రాన్ని తుంగలో తొక్కుతున్నారు.ఎడాపెడా భారీ నిర్మాణా లు చేపడుతు న్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, ఆదాయమే లక్ష్యంగా హిమ నగరాల్లో భారీ నిర్మాణాలకు ప్రభుత్వ మే అనుమతి ఇస్తోంది.

ఇదిలాఉంటే సిమ్లా నగర మాస్టర్ ప్లాన్ ముసాయిదా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నది పర్యావరణ నిపుణుల వాదన. మాస్టర్ ప్లాన్ ముసాయిదా వల్ల సిమ్లా నగరంలో మరిన్ని పర్యావరణ దుష్పరిణామాలు సంభవించే ప్రమాదముందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. జోషిమఠ్‌లో దాదాపు 450 హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సున్నిత మైన పర్వతవాలుల వెంట బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సొరం గాల కోసం పర్వతాలను పేల్చేస్తున్నారు. ఆ కారణంగానే భూ పొరలపై ఒత్తిడి పెరిగి, నేల కుంగి దాదాపు వెయ్యి ఇండ్లు బీటలు వారాయి. పర్వత నగరాల్లో భవన నిర్మాణాలను నిలిపివేయాలని మిశ్రా కమిటీ 1976లోనే సూచించినా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అన్ని హిమాలయ నగరాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.

 హిమ నగరాల దుస్థితికి ప్రభుత్వాల తీరే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. కమిటీల సూచనలను పెడచెవిన పెట్టి ఆదాయమే ప్రాధాన్యంగా అశాస్త్రీయ అభివృద్ది ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌, న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. పర్వత నగరాల్లో పర్యాటకుల రద్దీని నియంత్రించడంతోపాటు ప్రజా రవాణాకు ప్రాధాన్య మివ్వాలి. నేల తట్టుకోగలిగేలా తేలికపాటి ఇండ్లనే నిర్మించాలి. పర్వతవాలులపై భారీ నిర్మాణాలు చేపట్టకుండా అక్కడి ఆవరణ వ్యవస్థలను పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. అందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన ప్రత్యేకంగా ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. అడవులు, చెట్ల నరికివేతను నిషేధించాలి.ముందస్తు వరద, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను నెలకొల్పాలి. ప్రపంచంలోని ఇతర పర్వత నగరాల ప్రణాళికలను అధ్యయనం చేసి, మన దగ్గరా అటువంటివి రూపొందించుకోవాలి. హిమాలయ పర్వతాల ఆవరణ వ్యవస్థ దేశ రక్షణకు, ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం. కాబట్టి వాటి పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థ చర్యలు తీసుకోవాలి.

Latest Articles

నవ్విస్తూ, భయపెట్టిన OMG (ఓ మంచి ఘోస్ట్) ట్రైలర్

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్