స్వతంత్ర వెబ్ డెస్క్: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేండ్రం వెళ్తున్న స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీని గమనించిన లోకోపైలెట్ ముందు జాగ్రత్తగా వెంటనే ట్రైన్‌ను నిలిపేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం రాంపురం వద్ద చౌ చేసుకుంది. ఉన్నట్లుండి ట్రైన్‌లో నుంచి పెద్దఎత్తున పొగ వెలువడడంతో బోగీల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏదో జరుగుతోందో అర్థం కాక ఆందోళనకు గరుయ్యారు.
ఇంతలో లోకో పైలట్ ట్రైన్ ను అక్కడే నిలపగా.. రైలు బోగీల్లో మంటలు చెలరేగుతాయనే అనుమానంతో భయపడిపోయిన ప్రయాణికులు.. ట్రైన్ ఆపిన వెంటనే హుటాహుటిన అందులో నుంచి బయటకు పరుగులు తీశారు. ట్రైన్‌లో నుంచి పొగలు వెలువడుతున్నాయనే సమాచారంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. తక్షణ చర్యలు చేపట్టారు. బ్రేక్ లైనర్లు బిగుసుకోవటంతోనే పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరమ్మత్తులు పూర్తిచేసి రైలును పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోటవంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.