స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా గురునానక్ కాలనీలో అభి అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మురుగుకాల్వలో పడిపోయాడు. కుండపోత వర్షం పడడంతో డ్రైనేజీల్లో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గురునానక్ కాలనీ వద్ద ఓ డ్రైనేజీలో బాలుడు పడ్డాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. చివరకు ఆయుష్ అసుపత్రి సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.