37.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

వీడిన శిరీష డెత్ మిస్టరీ.. హత్య చేసింది అతనే..!

స్వతంత్ర, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం ఘోరంగా హత్యగావింపబడిన యువతి శిరీష డెత్ మిస్టరీ వీడింది. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అత్యంత పాశవికంగా హత్యగావింపబడిన ఈ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. శిరీష అక్క శ్రీలత భర్త అనిల్.. ఆమెను అతికిరాతకంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. శిరీషతో బావ అనిల్ వివాహేతర సంభంధం పెట్టుకున్నారని పోలీసులు తేల్చారు.

శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నందున అంటూ శిరీషను ఆమె అన్నయ్య కోపంతో తిట్టాడు. ఆ సమయంలోనే ఇంటికొచ్చిన భావ అనిల్.. శిరీషపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో శిరీష తీవ్ర మనస్తాపానికి చెందింది. ఈ సమయంలో మాట్లాడితే అందరూ చూస్తారని.. అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత ఇంటినుండి బయటకి వచ్చి గడియ పెట్టింది శిరీష. అక్కడికి వచ్చిన భావ అనిల్.. ఆమెతో మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గానివానలా మారింది. ఈ క్రమంలో అనిల్ కోపంతో ఊగిపోతూ శిరీషను అత్యాచారం చేసి, గొంతు కోసి చంపేశాడు.

అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా అనిల్ ను విచారించగా .. పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అనేక ప్రశ్నలను అనిల్ ను అడగగా.. తడబడటం గమనించారు. అనిల్ యే హత్య చేసి ఉంటాడని భావించిన పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో జరిగిన విషయమంతా వెళ్లగక్కాడు. శిరీషను అత్యంత ఆటవికంగా, క్రూరంగా చంపింది తానేనని.. శిరీష గొంతును బ్లేడుతో కోసి చంపేసి, స్క్రూడ్రైవర్‌తో కళ్లను చిద్రం చేసి, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిగుంటలో పడేశానని ఒప్పుకున్నారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్