అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విదేశీ పక్షులైన సైబీరియన్ పక్షులు స్వైర విహారం చేశాయి. కోర్టు ఆవరణలో చెట్లపై విహరిస్తూ కనిపించడంతో స్థానికులు పక్షులను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సైబీరియన్ పక్షులు సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనంతపురం జిల్లాకి వచ్చి అక్కడ తన సంతతిని పెంచుకొని తిరిగి విదేశాలకు వెళ్తుంటాయి. అయితే ఈసారి కొత్తగా మొదటిసారిగా గుత్తికి రావడం విశేషంగా ఉందంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటిని సైబీరియన్ పక్షులనే కాకుం డా సమశీతోష్ణ మండలాలలో కనిపించే కాస్మోపాలిటన్ జాతి పక్షులని కూడా పిలుస్తారు.


