Shooting in America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కల్లోలం జరిగింది. అలబామా రాష్ట్రంలో ఓ టీనేజర్ పుట్టినరోజు పార్టీ వేడుకల్లో గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. అలబామాలోని డాడెవిల్లేలో కాల్పులు జరిగాయని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో జరుగుతున్న పార్టీ వేడుకలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న గన్తో షూట్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కాల్పులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.