స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం మరొక్కసారి అట్టుడుకిపోయింది. అమెరికాలోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన కాల్పులు భయాందోళనకు గురిచేస్తుంది. టెక్సాస్ లోని షాపింగ్ మాల్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్ లెట్ మాల్ లో శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడు సహా 9 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే దుండగుడు నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కాల్పులు జరిపిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.


