బధిరులకు బాసటగా ఆశ్రయ్-ఆకృతి స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయని జయేష్ రంజన్( స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఈసీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ) అన్నారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువలకు డిజిటల్ ఎప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణా ప్లాట్ఫాంను విడుదల చేశారు. బధిరులతో అపారమైన తెలివితేటలు ఉంటాయని, వారి ఈ ప్లాట్ఫాం ఉపయోగపడుతుందన్నారు. వారిలో లోపం ఉన్నా వాటిని అధిగమించి అన్ని విషయాల్లో చురుకుగా ఉండటం అభినందనీయమన్నారు.
వేడుకల్లో భాగంగా బధిర విద్యార్థులు ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను తిలకించి అభినందించారు. ఆశ్రయ్ ఆకృతి స్వచ్చంద సంస్థ బధిరులకు చదువుతో పాటు వారి ఆలనాపాలన ఆండీస్తూ వారికి ఉపాధిని కూడా కల్పించడం ప్రశంశనీయమని, సంస్థ డిపీకే బాబు చేస్తున్న కృషి మార్గదర్శకమని కొనియాడారు. ఆశ్రయ్ ఆకృతి స్వచ్చంద సంస్థ బధిరులకు చేసిన సేవలకు బెస్ట్ ఇన్స్టిట్యూషన్ స్టేట్ అవార్డు లభించడం వారిలో ఉన్న కృషికి నిదర్శనమన్నారు. బధిర విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో క్వాల్కలమ్ ఇంజనీర్ ప్రిన్సిపాల్ సుధీర్ సుంకర, స్టేట్ స్ట్రీట్ డెవలెప్మెంట్ మేనేజర్ శరతాబాబు చిటిరాల, నీతూ చడ్డ, సూపర్ గ్యాస్ జనరల్ కౌన్సిల్ శ్రీమన్నారాయణ కడలి, డెల్ డిజిటల్ గ్లోబల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ జంపుల, జర్ఎఫ్ ఇండియా ప్రైవేట్ తదితరులు పాల్గొన్నారు.