స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 3న రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేశారు. వీరిద్దరి వివాహం రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖులు హజరయ్యారు. ఈ క్రమంలో శర్వా శుక్రవారం రిసెప్షన్ ను గ్రాండ్ గా జరుపుకున్నాడు. ఈ వేడుకకు టాలీవుడ్ తారాలోకం కదిలి వచ్చింది. టాలీవుడ్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పులువురు రాజకీయ నాయకులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
జైపూర్ లో జరిగిన శర్వా పెళ్ళికి ఒక్కడే వెళ్లిన రామ్ చరణ్.. హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కి భార్య ఉపాసనతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా గర్భవతి అయినా ఉపాసనను చెయ్యి పట్టుకొని రామ్‌చరణ్ నడిపించిన తీరు అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘క్యూట్ కపుల్, లవ్లీ కపుల్’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక శర్వా రిసెప్షన్‌కు ముందే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుకలోనూ సందడి చేశారు చెర్రీ దంపతులు. వరుణ్- లావణ్య ఉంగరాలు మార్చుకున్నాకా.. ఉపాసన తో కలిసి శర్వా రిసెప్షన్ కు వెళ్లిపోయాడు చరణ్. అలా మొత్తానికి తమ్ముడు ఎంగేజ్‌మెంట్, ఫ్రెండ్ రిసెప్షన్‌ను కవర్ చేశారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా సింపుల్ డ్రెస్ లో చరణ్.. గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఉపాసన చూడముచ్చటగా ఉన్నారు.