స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తన 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేస్తూ రాహుల్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు రాహుల్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇంకా ఢిల్లీలోని పార్టీ కార్యాలయం దగ్గర రాహుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు వెలిసాయి.
ఇక మరోవైపు రాహుల్ గాంధీకి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాహుల్ గాంధీజీ.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చింది. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
షర్మిల ట్వీట్‌తో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమైందని, అందుకు ఇది బలం చేకూరుస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు షర్మిలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఫోన్‌లో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయాలని కోరారు. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుండి షర్మిల పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిందని, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికల్లో కూడా షర్మిలను కాంగ్రెస్ ఉపయోగించుకోనుందని అంటున్నారు.