TSPSC Paper Leak |రాష్ట్రంలో TSPSCలో పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. టీఎస్ పీఎస్సీలో జరిగిన స్కాములపై సమగ్ర విచారణ జరిపించాలని.. ఆ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ను ఆమె ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేయగా.. టీఎస్ పీఎస్సీ కార్యాలయం చేరుకున్న ప్రవీణ్ ను అక్కడే అడ్డుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.