స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ‘పఠాన్’ విజయంతో మాంఛి ఊపు మీద ఉన్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తదుపరి చిత్రం ‘జవాన్’లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. చిత్ర కథపై ఎన్నో కసరత్తుల తర్వాత ఈ ప్రాజెక్టుకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా అభిమానులకు బిగ్ అప్టేడ్ ఇచ్చింది మూవీ యూనిట్.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. సంజయ్ దత్, అల్లు అర్జున్, దళపతి విజయ్, దీపిక పదుకొణే గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇంతమంది స్టార్స్ నటిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
#Jawan #7thSeptember2023 pic.twitter.com/7pBFy5Dfng
— Shah Rukh Khan (@iamsrk) May 6, 2023


