విశాఖ నుంచి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసమని వెళ్లిన ఫొటో గ్రాఫర్ మిస్సింగ్ విషాదాంతమైంది. రావుల పాలెం సమీపంలో యువకుడిని చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు షణ్ముఖ తేజ అనే 19 ఏళ్ల యువకుడు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ ఫొటోషూట్ కోసం కళ్యాణ్ సాయి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాతి రోజు నుంచి ఫోన్ స్విచాఫ్ రావడంతో పేరెంట్స్‌లో ఆందోళన మొదలైంది. దీంతో మల్లయ్య పాలెం పోలీసుల ను ఆశ్రయించారు. ఎంక్వైరీలో.. కళ్యాణ్ సాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది.
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన కళ్యాణ్ సాయి.. ఖరీదైన ఎక్విప్‌మెంట్‌తో వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ సాయికి పరిచయమైన షణ్ముఖ్ అనే యువకుడి సూచనతో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయి చివరకు హత్యకు గురయ్యాడు. కళ్యాణ్ సాయి దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్ మెంట్ కోసమే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఫోటో షూట్ కోసం అని.. తన కెమెరాలు తీసుకుని రైల్లో రాజమండ్రి చేరుకున్నాడు కళ్యాణ్ సాయి. అక్కడ కళ్యాణ్‌ను పికప్ చేసుకున్న షణ్ముఖ్ ..అద్దెకు తీసుకున్న కారులో ఆలమూరు, రావులపాలెం ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అనుమానం రావడంతో కళ్యాణ్.. సదరు కారు ఫోటో తీసి తన తల్లికి పంపించాడు. తన ఫోన్ పనిచేయక పోతే కాల్ చేయాలంటూ షణ్ముఖ్ నంబర్ ఇచ్చాడు.