రేణిగుంటలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని బైక్‌పై వచ్చి దోచుకుంటున్న 7 గురిని రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 మోటర్ సైకిళ్ళు, 8 మొబైల్ ఫోన్లు, 8 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తులో ఉండే నిందితులు రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దోచుకుంటారని సీఐ మల్లికార్జున తెలిపారు. తిరుపతి మారుతినగర్‌కి చెందిన జస్వంత్, సతీష్, దిలీప్, జస్వంత్, ప్రసన్నకుమార్, చరణ్, రియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల సురేష్‌బాబుపై దాడిచేసిన ఈ ఏడుగురు నిందితులు బంగాలు నగలు దోచుకున్నారు.


