25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలనాలు

     ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్‌రావును ఇప్పటికే ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయనను మరోమారు కస్టడీకి అడగ నున్నారు. ఆయనతోపాటు అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్‌ ఇంటె లిజెన్స్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా పనిచేసి సస్పెండైన ప్రణీత్‌రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడానికే పరిమితం కాకుండా సొంత పనులు కూడా చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేశారన్నది వీరిపై ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ముఖ్యంగా హవాలా లాంటి నల్లబజారు వ్యాపారాలు, స్థిరాస్తి దందాలపైనా కన్నేసి భారీగానే దండుకున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. ఈ బృందం బారినపడి సొమ్ము పోగొట్టుకున్న వారి మొత్తం వివరాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారులను లక్ష్యంగా చేసుకు న్నట్లు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపి స్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు.

SIB మాజీ DSP ప్రణీత్‌‌రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కోసం రవిపాల్‌‌ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయిల్‌‌ నుంచి సాఫ్ట్‌‌వేర్​ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్​కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్‌‌ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను దిగుమతి చేసుకున్నారని. ..ఇందుకు ఎస్​ఐబీ ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇలా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రవిపాల్‌‌ టీమ్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు.మరోవైపు తెలంగాణతోపాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్‌ చేసినట్టు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్