స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్ పార్టీలో(BRS) టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్లు దక్కని సిట్టింగ్స్.. టికెట్ దక్కిన వారిపై, పార్టీ అధిష్టానంపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, జనగామ(Janagama) జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari), ఎమ్మెల్యే రాజయ్య(MLA Rajaiah) మధ్య పొలిటికల్ కోల్డ్‌వార్ నడుస్తోంది. రాజయ్య సందర్భం వచ్చిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పంచ్‌లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు.
తాజాగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారింది. స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే.. అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.