23.3 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

‘అనన్య’కు అండగా సీనియర్ హీరో శ్రీకాంత్

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం “అనన్య”. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో “అనన్య” ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు!!

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ “శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్”కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న “అనన్య” ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు!!

సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, డాన్స్: బ్రదర్ ఆనంద్ – బాలు, ఫైట్స్: దేవరాజ్, మ్యూజిక్: త్రినాద్ మంతెన, కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి!!

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్