కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ భౌతిక కాయం బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచా రు. మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అంత్య క్రియలు రేపు నిజమాబాద్లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించ నున్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. పార్లమెం ట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు.
డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పార్టీకి విశిష్ట సేవలు అందిం చారని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్ పార్థివదే హానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమం తరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పిం చారు. డీఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్‌లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరుగను న్నాయి. సాయం త్రం నిజామాబాద్ ప్రగతి నగర్‌లోని ఆయన నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తీసుకురా నున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామా బాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డీఎస్ 1989, 99, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడి గా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తండ్రి మరణం పట్ల ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. అన్నా అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఐ మిస్ యూ డాడీ అంటూ ట్వీట్ చేశారు. తన తండ్రి, గురువు అన్నీ నాన్నే.! అన్నారు. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది నాన్నేనని చెప్పారు.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది నాన్నే అంటూ కన్నీరుపెట్టుకున్నారు .