39.2 C
Hyderabad
Friday, May 1, 2026
spot_img

ఏపీ ఎన్నికలపై ఆత్మసాక్షి సర్వే

ఏపీలో ఎన్నికలకు రోజుల వ్యవధే మిగిలింది. అధికార వైసీపీతో పాటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి 2024లో ఏపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఆత్మసాక్షి – ఇండియన్‌ పొలిటికల్‌ సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ టీమ్‌ నిర్వహించిన సర్వేలో మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది.

ఆత్మసాక్షి ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. జనవరి నుంచి మే వరకు ఆరు దశల్లో నిర్వహించిన సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీకి 48.5 శాతం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 46 శాతం, ఇతర పార్టీలకు 3.5 శాతం ఓటర్లు ఉన్నట్టు ఆత్మసాక్షి అంచనా వేసింది. సైలెంట్‌ ఓట్‌ ఫ్యాక్టర్‌ 2 శాతం ఉండొచ్చనింది.175 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఆధారం వైసీపీ 95 స్థానాలు, టీడీపీ కూటమికి 54 స్థానాలు, ఇతర పార్టీలకు 26 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇంచుమించు వైసీపీకి 95 – 113 స్థానాలు, టీడీపీ కూటమికి 54 -62 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. సర్వే ప్రకారం వైసీపీ మెజార్టీలో మహిళా ఓటర్లు, గ్రామీణ, పేదల ఓట్లు కీలకంగా మారనున్నాయి. సర్వే ప్రకారం 53 శాతం మహిళా ఓటర్లు, 52 శాతం పేద, నిరుపేద ఓటర్లు, 52 శాతం గ్రామీణ ఓటర్లు, 46 శాతం పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. 45 శాతం మహిళా ఓటర్లు, 46 శాతం పేద, నిరుపేద ఓటర్లు, 45 శాతం గ్రామీణ ఓటర్లు, 50 శాతం పట్టణ ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. పురుషుల్లో 50 శాతం మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్