29.2 C
Hyderabad
Sunday, November 3, 2024
spot_img

గేమ్ ఛేంజర్‌గా సెకండ్ లిస్ట్.. ఆ రెండు అంశాల్లో త్వరలో రానున్న క్లారిటీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: దసరా పండుగ ముగియడంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ రెట్టింపు అవుతోంది. ప్రధాన పార్టీలన్నీ రెండో జాబితాపై కసరత్తు వేగవంతం చేశాయి. ప్రధాన పార్టీలన్నీ ఓ వైపు తొలి జాబితా తాలూకా అసంతృప్త జ్వాలలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే మరో వైపు రెండో జాబితాపై దృష్టి సారించాయి. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీలు సెకండ్ లిస్ట్ పై ఫోకస్ పెడితే ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ పెండింగ్ స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రాన్ని పార్టీల అభ్యర్థుల రెండో జాబిత మార్చబోతన్నదనే టాక్ వినిపిస్తోంది. పొత్తులు, పార్టీల్లోని నేతల వలసల ప్రభావం ఈ రెండో జాబితా తర్వాత కీలక మలుపులు తీసుకుంటాయనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలు ప్రకటించబోయే సెకండ్ లిస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సీనియర్లంతా సెకండ్ లిస్ట్‌లోనే..
ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యనేతల దృష్టి అంతా ఢిల్లీపైనే ఉంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను అనౌన్స్ చేసిన హస్తం పార్టీ అధిష్టానం మిగతా 64 స్థానాలపై నజర్ వేసింది. ఈ మేరకు పార్టీ సీఈసీ మీటింగ్‌లో చర్చించబోతున్నది. ఇక బీజేపీ 52 మందితో తొలి జాబితా ప్రకటించగా మిగతా స్థానాలపై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఇరు పార్టీల ముఖ్య నేతలు ఇప్పటికే హస్తినాకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ తొలి జాబితాల్లో సీనియర్లకు చోటు దక్కలేదు.

దీంతో రెండు జాబితాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీకి దిగబోతున్నారు? సీనియర్లలో ఎవరి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఫైనల్ చేయబోతున్నదనే అంశం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరో వైపు రెండు నెలల క్రితం 115 మందితో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. మరో మూడు స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఇప్పటి వరకు 109 మంది అభ్యర్థులకు బీ ఫాంలు అందజేయగా మిగతా 10 మందికి బీ ఫాంలు అందలేదు. ఇక్కడ గులాబీ బాస్ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నది.

పొత్తులపై రానున్న క్లారిటీ..!
కాంగ్రెస్, బీజేపీ ప్రకటించబోయే రెండో జాబితాపై రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులు ఉంటాయా లేదా అనేది స్పష్టత రానున్నది. కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు కలిసి పని చేసే విషయంలో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనే పీటముడి కొనసాగుతున్నదని తెలుస్తోంది. ముఖ్యంగా సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సూత్రప్రాయంగా అంగీకారం చెప్పగా తమకు మునుగోడు కావాలని సీపీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిర్యాలగూడ, పాలేరు సీట్లు కావాలని సీపీఎం కోరుతున్నట్లు సమాచారం.

అయితే ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు తెలంగాణలో పోటీ చేసేందుకు పట్టుదలతో ఉన్న జనసేనకు బీజేపీ టచ్‌లోకి తీసుకుంటోంది. ఈ మేరకు పవన్‌తో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇటీవల భేటీ అయి చర్చలు జరిపారు. అయితే 20 సీట్లు ఇవ్వాలని పవన్ కోరగా 6 నుంచి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అమిత్ షాతో పవన్ భేటీ కాబోతున్నారు. ఆ తర్వాతే బీజేపీ సెకండ్ లిస్ట్ వెల్లడి కానున్నట్లు టాక్. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎలాంటి పొత్తు వ్యూహాలను అమలు చేస్తారనేది ఈ రెండో జాబితాపైనే ఆధారపడి ఉందనే చర్చ జరుగుతోంది.

Latest Articles

‘ధూం ధాం’ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్