హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమై నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. హరియాణా విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌నెస్ సర్టి ఫికేట్ 2018లోనే గడువు ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


