సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలు, ఇసుక దందాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని అంబేద్కర్ కోన సీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఈ సారి ఎన్నికల్లో తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తుతో నియోజకవర్గంలో విజయం వైపు అడుగులు వేస్తామని ఆయన అన్నారు. తన సోదరుడు బండారు శ్రీనివాస్ మద్దతు తనకు ఉందన్నారు. పొత్తులో భాగంగా తనకు టికెట్ ప్రకటించిన తర్వాత నియోజక వర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు కాసింత ఆగ్రహానికి గురైనా… తర్వాత పవన్ కల్యాణ్ ఆదేశాలతో వారంతా తనకు మద్దతు ఇస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న బండారు సత్యానందరావు.


