సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పేకాట కేంద్రాల ను ప్రోత్సహిస్తూ, జూద గృహాలకు అండగా ఉంటూ ఆర్థికంగా లాభం పొందుతున్నాడని నిర్ధారణ కావడం తో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సత్తుపల్లి గ్రామీణ ప్రాంతాలలో పేకాట కేంద్రాలు నిర్వహి స్తున్నారని పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు నిర్వహించారు. ఈనేపథ్యంలోనే పేకాటరాయుళ్ళను అదుపులో తీసుకొని విచారించారు. సత్తు పల్లి గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం తమకు దాడుల గురించి ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారని తెలిపారు.