డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ సర్కార్ మాట తప్పిందన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ముందుగా 7నెలల వడ్డీ చెల్లించాకే రుణ మాఫీ చేస్తామంటూ బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆయన ఆవేదక వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ దేవుడెరుగు వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిసెంబర్ నుంచి జూలై వరకు వడ్డీ తామే భరిస్తామని.. రైతులు నుంచి వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


