తెలుగు సీనియర్ నటుడు, అలనాటి అందగాడు శరత్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబు కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ తరలించారు. నగరంలోని ఏజీఐ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడడంతో ఐసీయూ నుంచి జనరల్ రూంలోకి షిఫ్ట్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా 1973లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత హీరోగా, తర్వాత క్యారెక్టర్ అర్టిస్టుగా నటించారు. ఇటీవల వచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో ఆయన చివరగా యాక్ట్ చేశారు.