సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కొద్దికాలంగా అనారోగ్యానికి గురైన ఆయన.. బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఈనెల 20న అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శరీరంలో ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్లు సమాచారం. కాసేపట్లో వైద్యులు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేయనున్నారు.


