21.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

సంక్రాంతి వేడుకొచ్చింది…మా పల్లె ఈడుకొచ్చింది

ఈపాట వింటే మీకు ఏమి గుర్తొస్తోంది…సంక్రాంతి పండుగ వచ్చింది…ఇంకా పడుకున్నావేంట్రా…‘యేహే లేరా చంటి..ఇంకా నిదరేంటి?’ అని తెలుగు రాష్ట్ర ప్రజలను తట్టి నిద్ర లేపుతున్నట్టుగా ఉంది.

ఏరా..అని సంబోదించామని ఏమీ అనుకోకండి…సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో అందరి పిలుపులు ఇలాగే ఉంటాయి…

‘ఏమేవ్…సుబ్బిగాడు వచ్చాడు…ఎలా ఉన్నావ్ రా, పెళ్లాం పిల్లలు బాగున్నారా?’ బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వినిపించే మాట ఇది…

‘‘ఒరేయ్…సుబ్బిగా…ఇదేనా రావడం, ఎన్నాళ్లయ్యింది రా నిన్ను చూసి…’’ ఇంత ఆత్మీయంగా పలకరించే పిలుపులు మళ్లీ కావాలన్నా దొరుకుతాయా?

‘‘ఒరేయ్…సుబ్బిగా…గొప్పోడివయ్యావంట కదా, చాలా సంతోషం రా’’ అని కొందరు నిండైన మనసుతో వారి ఇంట్లో వాడే గొప్పవాడైనంత ఆనందంతో చెప్పడం ఎక్కడైనా కనిపిస్తుందా?

ఇక స్నేహితులు కనిపిస్తే, ఆ జోషే వేరుగా ఉంటుంది…

‘‘ఒరేయ్, ఆగరా ఆగు, నీవొచ్చావని తెలిసి ఇంటికెళ్లా…’’అంటూ ఆయాసపడి వెతుక్కుంటూ వచ్చే మిత్రులు…ఈరోజుల్లో ఎందరుంటారు చెప్పండి.

అలా మీరు చిన్నప్పుడు నడిచిన వీధుల్లోంచి వెళుతూ…ఒక ఇంటి దగ్గర ఆగిపోయినప్పుడు…మీ మనసు చెప్పే ఊసులెన్నో కదా…

అప్పుడు మీ స్నేహితులు…‘‘ఒరేయ్, నువ్వు లవ్ లెటర్ పట్టుకుని తిరిగే అనంత లక్ష్మీ ఇల్లు రా…తనకి కూడా ఇద్దరు పిల్లలు, చూస్తావా! అంటూ ఇంట్లోకి చనువుగా తీసుకువెళ్లే అభిమానం, ఎన్నిచోట్ల ఉంటుంది.

అదే ఈరోజుల్లో అయితే తలుపు కొట్టి లోనికి వెళ్లాలి. లేదంటే మ్యానర్స్ లేదా, సంస్కారం లేదా? నీకు బుద్ధుందా?లేదా? చదువుకున్నావా? లేదా? అని అదేదో నేరమైనట్టు చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయిన స్థితి…

మనసులో కల్మషం లేని ప్రేమ…కళ్ల ముందు కనిపిస్తుంటే..మాటలు రాని భాష, మౌనంగా కాఫీ తాగి బయటకు వచ్చేస్తుంది.

ఈరోజుల్లాగా ఉదయం గుడ్ మానింగ్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, రాత్రికి గుడ్ నైట్, మరుసటి రోజు గుడ్ బై చెప్పేసుకునే స్థాయికి ఎదిగిపోయిన నేటి యువతరానికి… ఆ ప్రేమ మాధుర్యం ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.

అందుకే ఆ రోజుల్లో ఒక దేవదాసు పుట్టాడు. అతను తాగుబోతు అయినా… ఆ ప్రేమకు ఒక అర్థం ఉంది, లోకానికి ఒక పరమార్థం చెప్పి చచ్చిపోయాడు. అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం పిరికివాడిలా పారిపోవద్దని ఒక సందేశాన్నిచ్చాడు. కానీ నేడు దేవదాసు పేరు చెప్పుకుని పీపాలు పీపాలు తాగేసే తాగుబోతులు తప్ప ప్రేయసి కోసం తపించిపోయేవారు ఎవరున్నారు?

అందుకనే సంక్రాంతికి సొంత ఊరికి వెళితే, ఆ ఆనందాలు, అనుభూతులు, ఆనాటి సంగతులు, ఆ జ్నాపకాలు, ఆ ఊరితో అనుబంధాలు, చెట్లు, పుట్టలు, సెలయేళ్లు, వీటన్నింటి కోసం అందరూ పాకులాడుతుంటారు. ఎంత కష్టమైనా, ఎంత ఖర్చయినా పరుగులు పెడుతుంటారు.

ఒక ఏడాదికాలం నగరాల్లోని కాంక్రీట్ జంగిల్ లో పడి…అలుపు సలుపు లేకుండా పనిచేసి, సాయంత్రం అయ్యేసరికి పిచ్చుక గూడులాంటి అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి చేరి…కాసేపు సేద తీరి, మళ్లీ ఉదయం కాగానే కాలంతో పరుగులు తీసే సగటు మనిషి… కోరుకునే నిజమైన ఆనందం ఆ పల్లెల్లోనే ఉంది. ఇంకా ఎదగని ఆ పట్టణాల్లోనే ఉంది.

అందుకనే అందరూ సంక్రాంతి పండుగకి సొంతూళ్లకి పరుగులు తీస్తుంటారు. అందరూ అనుకుంటన్నట్టు కోడి పందాలు, పేకాటలు, సినిమాలు, పిండి వంటలకన్నా కొన్ని లక్షల రెట్లు ఆనందాన్నిచ్చే ఆత్మీయుల ఆలంబన, అనుబంధం, వారితో కలిసి మళ్లీ చెట్టూపుట్టల వెంట తిరగడం, ఆ సంక్రాంతి సందడి, ప్రజలంతా తండోపతండాలుగా కొత్త బట్టలు వేసుకుని కలర్ ఫుల్ గా బయటకు వచ్చి తిరుగుతుంటే చూసేందుకు ఆ రెండు కళ్లూ చాలవు కదా… అదే గుప్పెడంత మనసుకి చాలనిపిస్తుంది. అదే కిక్కు ఏడాదంతా పనిచేస్తుంది. అదే సంక్రాంతి పండుగ.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్