టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతలో మరో కోణం బయటపడింది. ఇన్నాళ్లు సాఫ్ట్, బ్యూటిఫుల్, కైండ్ హర్టెడ్ అనుకున్న అభిమానులకు దిమ్మతిరిగిపోయింది. ఓ నెటిజెన్ ఫొటోలతో సహా ఆమె బిహేవియర్ ఎలా ఉందో చెబుతూ పెట్టిన పోస్టుకి అంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ ఫోటోలలో ఏముందో తెలుసుకుందామా…
సమంత మెయిన్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన సినిమా ‘శాకుంతలం’. పురాణాల్లోని శకుంతల, దుశ్యంతుల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాను భారీ అంచనాలతో సోమవారం థియేటర్ లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఏం బాగాలేదని విమర్శల పాలవుతుంది.
ఈ క్రమంలో ట్విట్టర్ యూజర్ ఒకరు.. తాను చూసిన వరస్ట్ సినిమాల్లో శాకుంతలం మొదటి స్థానంలో ఉంటుందని ట్వీట్ చేశాడు. సమంత డబ్బింగ్ అస్సలు బాగోలేదని, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇంక ఆపు సమంత అని ఆమెను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన సమంత అతగాడిని బ్లాక్ చేసేసింది. దీంతో రెచ్చిపోయిన యూజర్.. నాకేనా.. నీకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇస్తానని అనుకున్నాడేమో కానీ.. ఆ స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఆ స్క్రీన్ షాట్ తో పాటుగా.. సమంత గురించి ఇలా రాసుకొచ్చాడు. “జస్ట్ సినిమా బాలేదని చెప్పినందుకు సమంత నన్ను బ్లాక్ చేసింది. నువ్వు చాలా చీప్ సమంత“ అంటూ ట్విట్ చేశాడు. ఆ నెటిజెన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సినిమా బాలేదంటే బ్లాక్ చేస్తారా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
She blocked me for just telling that I didn’t like the movie. @Samanthaprabhu2 You are Very Cheap. #Shaakuntalam #SSMB28 #SSMB29 #Pushpa2 #OV #Agent #Custody #KGFChapter2 pic.twitter.com/iY9EUFJtk0
— . (@rvtweetz9) April 14, 2023