Sachin Statue | క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. భారతదేశంలోనే అతి పెద్ద గ్రౌండ్ వాంఖేడ్ లో సచిన్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటుచేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ విగ్రహం ఏర్పాటుపై MCA అధ్యక్షుడు అమోల్ కాలే(Amol Kale) ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ఆటగాడికి ఇలా విగ్రహం ఏర్పాటుచేయడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.
Sachin Statue | MCA నిర్ణయంపై సచిన్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 25సంవత్సరాలుగా తనకు ఈ స్టేడియంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. మొదటి రంజీ మ్యాచ్ ఇక్కడే ఆడనని గుర్తుచేసుకున్నారు. విగ్రహం ఏర్పాటు లాంటి గొప్ప గౌరవం తనకు కల్పించినందుకు MCAకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. 2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా ఇంతకు ముందు భారత తొలి టెస్టు జట్టు కెప్టెన్ సీకే నాయుడు(CK Naidu) విగ్రహాన్ని దేశంలోని ఇండోరా, నాగ్ పూర్, ఏపీలోని స్టేడియాల్లో ఏర్పాటుచేశారు.