కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆమనగల్లులో ఇవాళ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు దీక్ష నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి అనుమతి కోరగా మొదట పోలీసులు నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయ కులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే పరిశీలించారు.