25.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

వరుణ్ తేజ్ చేతుల మీదుగా రుహాణి శర్మ సినిమా ట్రైలర్ రిలీజ్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ‘చి.ల.సౌ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహానీ శర్మ డిఫరెంట్ గెటప్ లో కనిపించింది. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. HER (హెర్) లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వరుణ్ తేజ్.

సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఈ ట్రైలర్ ఉండటం విశేషం. నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేలా ఉంది. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను కట్ చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ ఈ ట్రైలర్ వదిలారు. ఇందులో రుహాణి శర్మ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. మిగిలిన తారాగణం కూడా వారి వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియోలోని ఆసక్తికర డైలాగ్స్ సినిమా రేంజ్ తెలిపేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని పెంచుతూ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

ట్రైలర్ లో రుహానీ శర్మ ఫుల్ సీరియస్ మోడ్ లో కనిపించింది. ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ సినిమా రేంజ్ పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తోంది. కెరీర్ లో రుహానీ శర్మ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ‘ఎప్పుడూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలని ఉండేది. ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది. నా దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చేయగలనా అని ఒక డౌట్ ఉంది కానీ డైరెక్టర్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాను. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు నటించానని అనుకుంటున్నాను. జులై 21 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది’ అని రుహానీ శర్మ చెప్పుకొచ్చింది.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్