29.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

RRR చిత్ర నటుడు స్టీవెన్సన్ కన్నుమూత

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్:  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964లో జన్మించిన ఆయన ఎనిమిదేళ్ల వయసులో ఇంగ్లాండ్‌ చేరుకున్నారు. 1990ల్లో తొలుత టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టిన స్టీవెన్సన్ అనంతరం హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. 1998లో ‘థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ చిత్రంతో తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. థోర్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది. కాగా స్టీవెన్సన్‌ మృతిచెందడంతో ‘RRR’ చిత్రబృందం సంతాపం వ్యక్తంచేసింది. ‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్‌కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అని ట్వీట్ చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్