రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రేక్ వేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన డుప్లిసెస్(62), మ్యాక్స్ వెల్(77)పరుగులతో రాణించడంతో 20ఓవర్లలో 189 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ చెరో 2వికెట్లు తీశారు. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలో తగిన రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 182 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బ్యాటర్స్‌లో దేవదత్ పడిక్కల్ (52), జైశ్వాల్(47), ధ్రువ్(34), శాంసన్(22)పరుగులతో రాణించినా విజయం దక్కకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3వికెట్లతో రాణించాడు.