Nizamabad |నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు మొబైల్ విడిభాగాల వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా అర్ధరాత్రి ఒంటి గంటకు 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహారాష్ట్ర కొండల్వాడికి చెందిన వారు కాగా… మరో వ్యక్తి సాయిరాం నిజామాబాద్ జిల్లా దుబ్బపట్టణానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఒకే ప్రమాదంలో అన్నదమ్ములు గణేష్ , ఆదిత్య మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను నిజామాబాద్(Nizamabad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also: RRRలోని ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకోవటం అభినందనీయం: వెంకయ్య నాయుడు
Follow us on: Youtube Instagram